ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “దేవర” తో భారీ హిట్ అందుకొని మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత వార్ 2 లో తారక్ బిజీగా ఉన్నాడు. మరి తారక్ బావమరిదిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యిన యువ హీరో నార్నె నితిన్ కోసం తెలిసిందే. “మ్యాడ్”, “ఆయ్” సినిమాలతో సాలిడ్ హిట్స్ ని బ్యాక్ టు బ్యాక్ అందుకున్న నితిన్ ఇపుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు.
అయితే తనకి కాబోయే భార్య శివానితో నేడు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చయ వేడుకలు జరుగగా ఈ శుభ కార్యక్రమానికి తారక్ అండ్ ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. దీనితో యువ జంటతో తారక్ కుటుంబం కలిసి కనిపించిన పిక్స్ ఇపుడు బ్యూటిఫుల్ మూమెంట్స్ గా నిలిచాయి. అలాగే ఈ యువ జంటకి తారక్ తన ఆశీస్సులు కూడా అందిస్తున్నటుగా పోస్ట్ చేసి తెలిపాడు. దీనితో ఈ ఫోటోలు అభిమానులలో వైరల్ గా మారాయి.