‘చైతు -శోభితా’ వెడ్డింగ్ పై లేటెస్ట్ అప్ డేట్

హీరో నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే వీరి నిశ్చితార్థం వేడుక కూడా జరిగింది. ఇప్పటికే, ఈ జంట పెళ్లి పనులు కూడా మొదలు అయ్యాయి. పసుపు దంచుతున్న ఫొటోలను శోభితా తన ఇన్‌స్టాలో షేర్‌ చేయగా.. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐతే, ‘చైతు – శోభితా’ పెళ్లి వేడుక హైదరాబాద్‌లో జరగనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈవెంట్ కోసం వెడ్డింగ్ సెట్‌ను వేస్తున్నారట. కాగా ఈ వేడుకను డిసెంబర్ 4, 2024న ఎటువంటి గ్రాండ్ సెలబ్రేషన్‌లు లేకుండా నిర్వహిస్తారని.. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులతో పాటు సన్నిహితులు, అతికొద్ది మంది మిత్రులు మాత్రమే హాజరు అవుతారని తెలుస్తోంది. ఇక, సినిమాల విషయానికి వస్తే.. శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచారు. ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌ లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు.

Exit mobile version