టాలీవుడ్ ఇండస్ట్రీలో తరచుగా కొత్త నిర్మాణ సంస్థలు వస్తూనే ఉంటాయి. అలా తాజాగా వచ్చిన కొత్త నిర్మాణ సంస్థే “20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్” తమ ఫస్ట్ మూవీ టైటిల్‌ను ప్రకటించింది. తమ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మొదటి చిత్రానికి ‘లగ్గం టైమ్’ అని టైటిల్ పెట్టినట్లు వెల్లడించింది.ఈ చిత్రంలో యువ నటీనటులు రాజేష్ మేరు, నవ్య చిత్యాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ కథకు బలం చేకూర్చుతున్నారు.
ఇక ఈ చిత్రానికి ప్రజోత్ కె వెన్నం కథ అందించడమే కాకుండా డైరెక్ట్ చేస్తున్నారు. కె.హిమ బిందు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా పవనే అందిస్తున్నారు. ఈ మూవీ మ్యూజిక్ రైట్స్‌ను ఆదిత్య మీడియా సంస్థ కొనుగోలు చేసింది.
ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమా చేసిన దర్శకుడు సాగర్ కె చంద్ర ఆవిష్కరించడం విశేషం. ‘లగ్గం టైమ్’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన సాగర్ కె చంద్ర, ఈ చిత్రం ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు. వివాహం నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఓ మంచి కథతో రానుందని అంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఎంజాయ్ చేసే సినిమాలా దీనిని తీస్తున్నామని మూవీ మేకర్స్ వెల్లడించారు.