మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
మట్కా కథకి ఆద్యం ఎక్కడ పడింది?
మట్కా కథకి ఆద్యం ఒక ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్‌లో పడింది. ఓ మ్యారేజ్ ఫంక్షన్‌కి వైజాగ్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. మా వైఫ్ తరఫున బంధువుల్లో ఒక అతను పంటర్‌గా పని చేశాడు. ఏజెంట్స్‌లా అన్నమాట. అప్పుడు ఫస్ట్ టైం ఈ మట్కా గేమ్ గురించి విన్నాను. ఆ మాటల సందర్భంలో వైజాగ్ లో నైట్ క్లబ్బులు, క్యాబరీలు ఉండేవని తెలుసుకున్నాను. వైజాగ్ వన్ టౌన్ గురించి, అక్కడ కల్చర్ తెలుసుకున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అక్కడి నుంచి అసలు ఈ గేమ్ ఎవరిది అనేది పరిశోధించడం మొదలుపెట్టాను.
ఇందులో మీ మార్క్ చెప్పడానికి స్కోప్ దొరికిందా?
మన దగ్గర అద్భుతమైన కథలు, సాహిత్యం ఉంది. మనం తీసినన్నీ గొప్ప సినిమాలు ఎవరూ తీయలేదు. ‘మాలపిల్ల’ అనే సినిమా అందరికంటే ముందు మనం తీశాం. గొప్ప సాహిత్యం, కథలు, కల్చర్ ఉన్న తెలుగు నేల మనది. ‘మట్కా’ నా స్టయిల్ అఫ్ స్టోరీ టెల్లింగ్‌తో ఒక కథని అందరినీ అలరించేలా చెప్పేలానే ఉంటుంది. మట్కా పక్కా కమర్షియల్ సినిమా.
వాసు క్యారెక్టర్‌లో వరుణ్ తేజ్ గారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు?
వరుణ్ తేజ్ గారి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇందులో కనిపిస్తుంది. 20 ఏళ్ల తర్వాత కూడా మట్కానే ప్రస్తావిస్తారు. వరుణ్ గారు చాలా కూల్ పర్సన్. చాలా డెడికేషన్‌తో వర్క్ చేశారు.
మట్కా కోసం రతన్ ఖత్రి జీవితాన్ని ఎంతలా తీసుకున్నారు?
ఇందులో రతన్ ఖత్రి గారి జీవితాన్ని తీసుకోలేదు. ఆయన కథని ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్‌గా తీస్తున్నారు. అది వెబ్ సిరిస్ గానే తీయాలి. సినిమాకి వర్కౌట్ అవ్వదు. ఇందులో ఒకటే సిమిలారిటీ ఏంటంటే.. రతన్ ఖత్రి పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చారు. ఇందులో వాసు బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. వైజాగ్‌లో బర్మా కాలనీ ఉండేది. అందులో రకరకాల మనుషులు ఉండేవారు.
ఎన్ని రోజులు షూటింగ్ చేశారు? అనుకున్న బడ్జెట్ లోనే తీశారా?
79 రోజులు షూటింగ్ చేశాం. ఇప్పటివరకు నేను అన్ని సినిమాల్ని అనుకున్న బడ్జెట్‌లోనే పూర్తి చేశాను. ఈ సినిమాను కూడా అనుకున్న బడ్జెట్ లోనే కంప్లీట్ చేశాం.
ఇందులో విలన్ రోల్స్ గురించి?
ఇలాంటి సినిమాల్లో పరిస్థితులు, పాలిటిక్స్ విలన్‌గా ఉంటాయి. వాటిని క్యారీ చేస మైండ్ గేమ్ అదే విలన్స్ కావాలి. అందులో కన్నడ కిషోర్, జాన్ విజయ్ లది అలాంటి పాత్రలే. ఇందులో దాదాపు గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. అజయ్ ఘోష్ గారిది వెరీ సర్‌ప్రైజింగ్ అండ్ పాజిటివ్ క్యారెక్టర్. మీనాక్షి, నోరా, నవీన్ చంద్ర క్యారెక్టర్స్ కథలో చాలా కీలకంగా ఉంటాయి.
వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ గురించి?
నేను వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి కథ చెప్పాను. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో నా గత సినిమా చేశాను కాబట్టి వాళ్లు నా వర్క్‌ని ఇష్టపడి స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయ్యారు. ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు. ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే పాషన్‌తో వర్క్ చేశారు.