పవన్ నిర్ణయానికి యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్..

టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీకి ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే భారీ సినిమా “హరిహర వీరమల్లు” షూట్ లో పాల్గొని మళ్ళీ తన రాజకీయ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పైగా దీనికి యూనానిమస్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వస్తుండడం విశేషం.

తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాకి సంబంధించి ఒక బిల్లు రావాలని ప్రతిపాదించారు. సోషల్ మీడియాలో చాలా మంది ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు అని తెలిసిందే. ఆడ మగ అని తేడా లేకుండా దారుణంగా మార్ఫ్ లు ట్రోల్స్ తో బూతులతో పోస్ట్ లు కామెంట్స్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాటిని అరికట్టడానికి సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ అనే చట్టాన్ని తీసుకురావాలని పవన్ ప్రతిపాదించారు.

అయితే ఇంట్రెస్టింగ్ గా దీనికి యూనానిమస్ రెస్పాన్స్ అందరి నుంచి వస్తుంది. సినీ సహా సోషల్ మీడియాలో టెక్ రంగానికి చెందిన వారి నుంచి కూడా పవన్ నిర్ణయం విషయంలో ఏకీభవిస్తున్నారు. దీని వల్ల ఖచ్చితంగా సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణమైన అంశాలని అరికట్టొచ్చు అని వారు భావిస్తూ దీనిని త్వరలోనే అమలు లోకి తీసుకువస్తే బాగుంటుంది అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version