టాలీవుడ్ బిగ్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు కూడా ఒకరు. మరి ఈ ఇద్దరి విషయంలో గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో అభిమానుల నడుమ ఒకింత పెద్ద రచ్చే నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన ఘటనతో వారి అభిమానుల నడుమ అంతర్యుద్ధం మొదలైంది. అయితే ఇవన్నీ ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ చేసిన మరో కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.
నటసింహం నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాప్పబుల్ లోకి గెస్ట్ గా రాగా అందులో పవన్ పై సాలిడ్ కామెంట్స్ చేశారు. కళ్యాణ్ గారిలో నాకు ఆయన ధైర్యం అంటే చాలా ఇష్టం, సొసైటీలో చాలా మందిని చాలా దగ్గరగా చూసాను కానీ కళ్యాణ్ గారిని లైవ్ లో చూసినపుడు తన డేరింగ్ అంటే చాలా ఇష్టం అంటూ ఐకాన్ స్టార్ సాలిడ్ స్టేట్మెంట్ ని అందించాడు. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు పవన్ ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ నడుమ వైరల్ గా మారాయి.