ఇంటర్వ్యూ: డైరెక్టర్ అర్జున్ జంధ్యాల – ‘దేవకి నందన వాసుదేవ’ ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘గుణ 369’ తర్వాత మీ రెండో సినిమాకి ఇంత గ్యాప్ రావడానికి కారణం?

గ్యాప్ ఏమీ లేదండి. కరోనా కారణంగా సహజంగానే అందరికీ ఓ రెండేళ్ళు గ్యాప్ వచ్చింది. తర్వాత ఈ ప్రాజెక్ట్ తో దాదాపు ఏడాదిన్నరగా ట్రావెల్ అవుతున్నాను. ఇలా చూసుకుంటే గ్యాప్ లేనట్లే.

‘దేవకి నందన వాసుదేవ’ ట్రైలర్ లో కంసుడు, కృష్ణుడు రిఫరెన్స్ కనిపించింది? ఆ కథ స్ఫూర్తి ఉందా?

ఆ రిఫరెన్స్ ఇందులో ఉంటుంది. మూడో సంతానం వలన మరణం అని ట్రైలర్ లోనే చాలా క్లియర్‌గా చెప్పాం. అయితే చెప్పని విశేషాలు చాలా ఉన్నాయి. ట్రైలర్లో కంటే చాలా ఎక్కువ కథ సినిమాలో ఉంది.

ప్రశాంత్ గారు చెప్పిన కథకి మీరు ఎలాంటి మార్పులు చేసుకున్నారు?

దర్శకుడిగా కథని ఓన్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు కొన్ని ఐడియాస్ వస్తాయి. కథని ఇంకా అద్భుతంగా చెప్పాలనిపిస్తుంది. నేను చెప్పిన కొన్ని ఆలోచనలకి ప్రశాంత్ గారు హ్యాపీగా ఫీలయ్యారు. ఆయన సినిమా చూసి చాలా సర్‌ప్రైజ్ ఫీల్ అయ్యారు.

అశోక్ గారు ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. లుక్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు?

ఈ కథకు, ఆయన క్యారెక్టర్ కి ఎలాంటి లుక్ అయితే బాగుంటుందనే దానిపై చాలా వర్క్ చేసాం. ప్రతిదీ ఆ క్యారెక్టర్ నుంచి డిజైన్ చేసుకున్నాం. అశోక్ గారు యాక్షన్ ఎమోషన్ లో ఇరగదీస్తారు. ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశారు. తన పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు.

ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది మురారితో కరెక్ట్ అవుతున్నారు?

మురారిలో ఒక డెస్టినీ ఫీల్ వుంటుంది. ఇందులో అది ఇంకోరకంగా ఉంటుంది. హీరోకి ఒక గండం ఉంది. ఆ గండం నుంచి ఎలా బయటపడతారనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ట్రైలర్ లో కూడా ఎక్కడా లేనివిధంగా భూమిలో సుదర్శన చక్రంతో వాసుదేవుని విగ్రహం అని చెప్పాం. దానికి ఒక కనెక్షన్ ఉంది. అది చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఒక సెపరేట్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అది కచ్చితంగా చెప్పగలను.

హీరోయిన్ మానస వారణాసి గురించి?

మానస మిస్ ఇండియా 2020. తన పాత్రకు చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్.

కంసరాజ్ పాత్రలో చేసిన దేవదత్త గురించి?

దేవదత్త గారు కంసరాజ్ పాత్రని చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాతో ఆయనకి చాలా మంచి పేరు వస్తుంది.

ఈ సినిమాకి విజయనగరం బ్యాక్ డ్రాప్ తీసుకొని కారణం?

ఈ కథకి అలాంటి టెంపుల్, ఆ లొకేషన్ అయితే యాప్ట్ గా ఉంటుందని అనిపించింది. ఆడియన్స్ కి చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

ఈ సినిమాలో మీకు ఛాలెంజింగ్ గా అనిపించినా ఎలిమెంట్స్ ఏమిటి?

ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇచ్చిన కథకి 100% న్యాయం చేయాలి. అలాగే ఖచ్చితంగా ఈ సినిమాని హిట్ చేయాలి. ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేయడం ఛాలెంజింగ్.

నిర్మాతలు సపోర్ట్ గురించి?

బాలకృష్ణ గారు చాలా పాషనేట్ ప్రొడ్యూసర్. ఈ కథకి ఏం కావాలో అన్ని సమకూర్చి చాలా గ్రాండియర్ గా సినిమాని నిర్మించారు.

Exit mobile version