తండేల్ నుండి ‘బుజ్జి తల్లి’ సాంగ్‌కు డేట్ ఫిక్స్

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తండేల్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవల అధికారికంగా అనౌన్స్ చేశారు.

కాగా, ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘బుజ్లి తల్లి’ అనే లవ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. తాజాగా ఈ పాటను ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు అనే విషయంపై వారు క్లారిటీ ఇచ్చారు. లవ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనున్న ‘బుజ్జి తల్లి’ సాంగ్‌ను ఫిబ్రవరి 21న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతో అభిమానులు ఈ సాంగ్ కోసం మరింత ఆతృతగా చూస్తున్నారు.

ఇండియా-పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీ వాస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా అల్లు అరవింద్ ప్రెజెంట్ చేస్తున్నారు.

Exit mobile version