గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు శంకర్ ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
అయితే, ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ తాజాగా కడపలోని అమీన్ పీర్ దర్గాన సందర్శించాడు. ఆయనతో పాటు దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కడపకు వస్తున్నాని తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో ఆయన్ను చూసేందుకు వచ్చారు. దీంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది.
కడప అమీన్ పీర్ దర్గాకు ప్రత్యేకత ఉండటంతో పలువురు సెలబ్రిటీలు ఇక్కడికి వస్తుంటారు. అయితే, తాజాగా సర్వమత సామరస్యానికి ప్రతీకగా అయ్యప్ప మాల వేసుకున్న రామ్ చరణ్ ఇక్కడి రావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.