‘కల్కి 2’ 35 శాతం షూట్‌ చేశారట !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. అటు కలెక్షన్స్ లోనూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఐతే, దీనికి కొనసాగింపుగా ‘కల్కి 2’ రానున్న విషయం తెలిసిందే. ఇక ‘కల్కి 2’ సినిమా విశేషాలు తెలుసుకునేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ‘కల్కి 2’ అప్ డేట్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

కాగా ‘ఇఫ్ఫీ’ వేడుకల్లో చిత్ర నిర్మాతలు స్వప్న- ప్రియాంక.. ‘కల్కి 2’ షూటింగ్‌ గురించి మాట్లాడారు. ‘కల్కి పార్ట్‌ 2కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కాకపోతే, రెగ్యులర్‌ షూట్‌ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. త్వరలోనే అన్ని ప్రకటిస్తాం. ‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె.. పార్ట్‌ 2లోనూ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించనుంది’ అని స్వప్న- ప్రియాంక క్లారిటీ ఇచ్చారు.

స్వప్న- ప్రియాంక ఇంకా మాట్లాడుతూ. ‘కల్కి 2898 ఏడీ’తో పాటే సీక్వెల్‌కు సంబంధించిన షూట్‌ను కొంతమేర తీయడం జరిగింది. పార్ట్‌ 2కు సంబంధించి 35 శాతం షూట్‌ జరిగింది’ అని తెలిపారు. అలాగే, గోవా వేదికగా జరుగుతోన్న ‘ఇఫ్ఫి’ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని స్వప్న- ప్రియాంక చెప్పారు.

Exit mobile version