మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన రీసెంట్ మూవీ ‘లక్కీ భాస్కర్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ బ్యాంకింగ్ ఫ్రాడ్ నేపథ్యంలో సాగింది. ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో థియేటర్లలో మంచి రెస్పాన్స్ లభించింది. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్‌ను థ్రిల్ చేసేందుకు రెడీ అయ్యింది. ‘లక్కీ భాస్కర్’ చిత్రం అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నవంబర్ 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
దీంతో ఈ సినిమాను ఓటీటీలో ఎంజాయ్ చేసేందుకు మరోసారి ఆడియెన్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా.. జివి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు.