ఇండియా లోనే హైయెస్ట్ పైడ్ హీరోగా అల్లు అర్జున్ హిస్టరీ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “పుష్ప 2” పట్ల హైప్ ఏ లెవెల్లో ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఈ సినిమాకి ముందు వచ్చిన పార్ట్ 1 తో టెస్ట్ చేసుకున్న తన పాన్ ఇండియా క్రేజ్ విషయంలో పాస్ అయ్యిన బన్నీ ఇపుడు పాన్ ఇండియా మార్కెట్ లో ప్రభాస్ తర్వాత తిరుగు లేని మరో హీరోగా నిలిచాడు.

దీనితో ఐకాన్ స్టార్ పాన్ ఇండియా లెవెల్లో తన దమ్ము చూపిస్తుండగా ఇపుడు పుష్ప 2 విషయంలో ఓ క్రేజీ టాక్ వైరల్ గా మారింది. ఈ సినిమాకి ఏకంగా అల్లు అర్జున్ 300 కోట్ల పారితోషికం తీసుకున్నాడు అంటూ పలు రూమర్స్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఆ మధ్య బన్నీ వాసు కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఐదేళ్లు ఓ సినిమాకి కేటాయిస్తే ఆటోమాటిక్ గా ఈ రేంజ్ లోనే ఉంటుంది అని కూడా అన్నారు.

ఇపుడు ఇదే క్రమంలో పుష్ప 2 కోసం ఐకాన్ స్టార్ తీసుకున్న భారీ మొత్తం అంటూ ఈ ఫిగర్ వైరల్ గా మారింది. దీనితో ఇండియా లోనే హైయెస్ట్ పైడ్ హీరోగా అల్లు అర్జున్ నిలిచాడని టాక్ స్ప్రెడ్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో కానీ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో అల్లు అర్జున్ పేరు మామూలుగా వినిపించట్లేదని చెప్పాలి.

Exit mobile version