విషాదం.. స్టార్ హీరోయిన్ సమంత తండ్రి కన్నుమూత

స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు హఠాన్మరణం పొందారు. ఈ వార్తను సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ‘మళ్లీ మనం కలుసుకునే వరకు డాడ్’ అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీని సమంత పోస్ట్ చేసింది.

అయితే, జోసెఫ్ ప్రభు మరణానికి గుండెపోటు కారణమని తెలుస్తోంది. ఆయన నిద్రలో ఉండగానే గుండెపోటుకు గురై మృతి చెందినట్లుగా తెలుస్తోంది. భార్యతో జోసెఫ్ ప్రభు చెన్నైలో జీవిస్తున్నారు. ఈ వార్తతో చిత్ర వర్గాల్లో విషాదం నెలకొంది. సమంతకు ఆమె తండ్రి అంటే ఎంతో ప్రేమ అని.. ఆమె తన కెరీర్‌లో పైకి రావడానికి తన తండ్రి ఎంతగానో కృషి చేశాడని సమంత పలుమార్లు తెలిపింది.

సమంత తండ్రి మరణవార్త గురించి తెలుసుకున్న పలువురు ఆమెకు తమ సంతాపం తెలుపుతున్నారు. సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమెకు ధైర్యాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version