కొన్నాళ్ల కితం టాలీవుడ్ యువత బాగా మాట్లాడుకున్న కోలీవుడ్ యూత్ హిట్ చిత్రం “డా.. డా” కూడా ఒకటి. తమిళ్ లో మంచి హిట్ అయ్యిన ఈ చిత్రంని తెలుగులో ఓటిటిలో చూద్దామని చాలా మంది అనుకున్నారు కానీ ఈ సినిమా ఏ ఓటిటిలో కూడా రాలేదు. అయితే ఫైనల్ గా తెలుగు వెండి తెరపైకి ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు.
డిసెంబర్ 13న ఈ చిత్రాన్నిఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. గత ఏడాది తమిళంలో ‘డా..డా’ మూవీ సెన్సేషనల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రదారులుగా, డైరెక్టర్ గణేష్ కె బాబు తెరకెక్కించిన ‘డా..డా’ చిత్రం తమిళ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది.
కామెడీ, భావోద్వేగం, ప్రేమ.. ఇవన్నీ సరైన స్థాయిలో మిక్స్ చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్టు అవుతుందని, బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుదల చేయబోతున్నారని చెప్పారు. మరి ఈ చిత్రం తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.