నైజాంలో “పుష్ప 2” పెయిడ్ ప్రీమియర్స్.. భారీ ధరతో షోస్!?

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా వైడ్ గా పుష్ప రాజ్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ అవైటెడ్ సీక్వెల్ పట్ల నెక్స్ట్ లెవెల్ హైప్ బిల్డప్ అయ్యింది.

అయితే ఈ చిత్రంకి ఓ రోజు ముందే అది కూడా తెలుగు రాష్ట్రాల్లో పైడ్ ప్రీమియర్స్ ఉంటాయి అని టాక్ ఉంది. ముందుగా అయితే మైత్రి థియేటర్స్ లోనే రాత్రి 9 గంటల షోతో పుష్ప 2 స్టార్ట్ అవుతుంది అని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇపుడు మాత్రం భారీ లెవెల్లో పెయిడ్ ప్రీమియర్స్ కి సన్నాహాలు చేస్తున్నారట.

ముఖ్యంగా నైజాంలో పలు సింగిల్ స్క్రీన్స్ లో లిమిటెడ్ గా డిసెంబర్ 4 నుంచే షోస్ పడిపోనున్నట్టుగా ఇపుడు వినిపిస్తుంది. మరి దీనికి గాను ఏకంగా టికెట్ పై 800 ఎక్స్ట్రా ఛార్జ్ తో ఒకో టికెట్ ని 1000 రూపాయల మేర పెట్టి ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇపుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్. మరి దీనిపై మాత్రం అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version