టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా ‘పుష్ప-2’ ఈవెంట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ మేనియాతో అభిమానులు ఊగిపోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్ టేకింగ్‌తో నెక్స్ట్ లెవెల్‌లో సెట్ చేస్తున్నాడు. ఇక మరికొన్ని గంటల్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా ‘పుష్ప-2’ మారింది.

ఇప్పటికే పలు నగరాల్లో ఈవెంట్స్‌తో హోరెత్తించిన ‘పుష్ప-2’ హైదరాబాద్‌లో ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. అయితే, ముందుగా ఈ ఈవెంట్‌ని వేరొక చోట ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఒక్కరోజు ముందే ఈ మాస్ జాతర ఈవెంట్‌ను యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లోకి మార్చి, ఏర్పాట్లను కూడా భారీగా చేశారు. అంతేగాక, అనుకున్నదానికంటే ఎక్కువగా ఈ ఈవెంట్‌ను సక్సె్స్ చేయడంలో నిర్వాహకులు విజయం సాధించారు.

ఇలా సింగిల్ డేలో ‘పుష్ప-2’ లాంటి క్రేజీ మూవీకి సంబంధించి ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడమే కాకుండా, దాన్ని ఇంత భారీ సక్సెస్ చేయడంతో మైత్రీ మూవీ మేకర్స్ స్ట్రాటెజీకి టాలీవుడ్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Exit mobile version