మన తెలుగు సినిమా అలాగే తెలుగు రాష్ట్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఈ ఏడాదిలో ఒక్క సినిమాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా తన పవర్ ఏంటో చూపించాడు. మరి ఎలాంటి పాన్ ఇండియా సినిమా లేకుండానే నార్త్ ఆడియెన్స్ లో పవన్ కళ్యాణ్ కి భారీ జన ప్రవాహం వచ్చింది.
మరి దీనితో పవన్ క్రేజ్ లోకల్ నుంచి నేషనల్ వరకు వెళ్ళింది అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఇపుడు దీనికి మించిన కిక్ తో పవన్ అభిమానులు గాల్లో తేలుతున్నారు. ఈసారి పవన్ నేషనల్ లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయ్యారు.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో గ్లోబల్ లెవెల్లో అత్యధికంగా వెతికిన సినీ నటులు జాబితాలో పవన్ కళ్యాణ్ ఏకంగా వరల్డ్ వైడ్ టాప్ 2 స్థానంలో నిలవడం విశేషం. దీనితో ఇపుడు పవన్ అంటే నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్ అని చెప్పాలి. ఇక ప్రస్తుతం పవన్ తన భారీ సినిమా హరిహర వీరమల్లు లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంకోపక్క తను లేకుండా ఓజి షూట్ కూడా జరుగుతుంది.