మొల్లేటి ‘పుష్ప’రాజు విధ్వంసం..1000 కోట్లతో చరిత్ర తిరగరాసిన అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రమే “పుష్ప 2 ది రూల్”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ అందుకొని ఇండియన్ సినిమా దగ్గర కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేయగా అనుకున్నట్టుగానే ఈ చిత్రం 1000 కోట్ల మార్క్ ని దాటుతుంది అనే ఆలోచనని నిజం చేసి చూపించింది.

అది కూడా ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా అందుకోని విధంగా ఫాస్టెస్ట్ 1000 కోట్ల గ్రాస్ అందుకున్న చిత్రంగా కేవలం 6 రోజుల్లోనే రాబట్టి దుమ్ము లేపింది. అయితే ఇప్పుడు వరకు బాహుబలి 2 ఫాస్టెస్ట్ 1000 కోట్ల గ్రాసింగ్ సినిమాగా 10 రోజుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ దానిని నాలుగు రోజులు ముందే టచ్ చేసి అల్లు అర్జున్ చరిత్ర తిరగరాశారు అని చెప్పాలి.

ఇలా మొత్తంగా మాత్రం మొల్లేటి పుష్పరాజు పేరిట ఈ నెవర్ బిఫోర్ రికార్డు కూడా వచ్చి పడింది అని చెప్పాలి. ప్రస్తుతానికి మేకర్స్ కూడా పుష్ప 2 వెయ్యి కోట్ల మార్క్ ని దాటేసినట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. ఇలా మొత్తానికి పుష్ప 2 ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక మర్చిపోలేని ఇతిహాసాన్ని రాసుకుంది అని చెప్పాలి.

Exit mobile version