‘క’ తరువాత కిరణ్ అబ్బవరం నెక్స్ట్ ప్రాజెక్ట్ రివీల్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రీసెంట్ మూవీ ‘క’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను పూర్తి సైకలాజికల్ థ్రిల్లర్‌గా మేకర్స్ తెరకెక్కించడంతో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎంతగానో ఎదురుచూసిన సక్సెస్ రానే వచ్చింది.

ప్రస్తుతం ‘క’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు మళ్లీ తన స్పీడును పెంచేందుకు సిద్ధమవుతున్నాడు. తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించబోతున్నట్లు ఆయన తాజాగా వెల్లడించారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం తాను సిద్ధమవుతున్నానని.. త్వరలోనే పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తానని ఆయన తన కొత్త లుక్‌ను రివీల్ చేశారు.

ఇలా తన నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను ఇవ్వడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అప్పుడే క్యూరియాసిటీ పెరుగుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనేది చూడాలి.

Exit mobile version