‘పుష్ప-2’ ప్రీమియర్స్ నేపథ్యంతో చోటు చేసుకున్న విషాద ఘటన పై హీరో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యావత్ తెలుగు సినీ పరిశ్రమ షాక్‌కి గురయ్యింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా పలువురు సినీ ప్రముఖులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి తరలివెళ్తున్నారు.
ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు మెగాస్టార్ చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కి రావద్దని సూచించారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఇలాంటి కష్ట సమయంలో తమ కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచేందుకు మెగాస్టార్ అల్లు ఇంటికి చేరుకున్నాడు.
ఇక బన్నీపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.