ఆ రూమర్స్ పై మోహన్ బాబు క్లారిటీ..

రీసెంట్ గా మన టాలీవుడ్ లో పలువురు ప్రముఖులుకి సంబంధించి జరిగిన కాంట్రవర్సీలు తెలిసిందే. ఓ పక్క మంచు కుటుంబంలో గొడవలు ఇంకో పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తో టాలీవుడ్ లో హీట్ వాతారవరణం నడుస్తుంది. అయితే ఈ సమయంలోనే మోహన్ బాబుపై కేసు తాను కూడా అరెస్ట్ అవుతారు అంటూ పలు వార్తలు రాగా దీనిపై తాను బయట కనిపించకుండా తిరుగుతున్నారు అంటూ తెలిపారు.

అయితే దీనిపై ఇపుడు క్లారిటీ మోహన్ బాబు ఇచ్చేసారు. తనపై ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు అని తాను తనపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. అలాగే తనకి ముందస్తు బెయిల్ రద్దు అయ్యింది అనే వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు అని ప్రస్తుతం తన ఆరోగ్య రీత్యా చికిత్స తీసుకుంటున్నాను అని మోహన్ బాబు తెలిపారు. సో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

Exit mobile version