‘బచ్చల మల్లి’ ట్రైలర్.. ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న నరేష్

హీరో అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఈ చిత్ర ట్రైలర్ వచ్చింది. నేచరల్ స్టార్ నాని చేతులమీదుగా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం మాస్ అంశాలతో పాటు ఎమోషన్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాయి. అటు టైటిల్ రోల్ లో అల్లరి నరేష్ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటం ఈ ట్రైలర్ కి హైలైట్ అని చెప్పాలి.

ఇందులో కొన్ని ఆకట్టుకునే డైలాగ్స్ కూడా మనల్ని సర్ప్రైజ్ చేస్తాయి. హీరోయిన్ అమృత అయర్ కి కూడా మంచి రోల్ దక్కింది. మొత్తంగా ఈ బచ్చల మల్లి ట్రైలర్ తో అల్లరి నరేష్ నుంచి మరో సాలిడ్ మూవీ వస్తుందని అర్ధమవుతుంది. దర్శకుడు సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version