శ్రీలీల డబుల్ ఆఫర్.. ఒకేసారి ఇద్దరు బ్రదర్స్‌తో సినిమా..?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. వరుసగా స్టార్ యాక్టర్స్‌తో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే.. ‘పుష్ప-2’ వంటి ప్రెస్టీజియస్ మూవీలో ‘కిస్సిక్’ అంటూ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఈ పాటతో ఒక్కసారిగా శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే, ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్‌తో ఒకేసారి సినిమాలు చేసేందుకు శ్రీలీల సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది.

శ్రీలీల తన నెక్స్ట్ ప్రాజెక్టులుగా సైన్ చేసిన రెండు సినిమాల్లో అక్కినేని ఫ్యామిలీ సోదరులు నటించబోతున్నారట. ‘విరూపాక్ష’ ఫేం దర్శకుడు కార్తీక్ దండుతో శ్రీలీల ఓ సినిమా ఓకే చేసింది. ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగచైతన్య నటించబోతున్నాడు. ఈ సినిమాను ‘తండేల్’ రిలీజ్ తరువాత పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

ఇక మరో దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఓ కథను చెప్పగా, దానికి శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా నటించే అవకాశం ఉందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా 2025 ప్రథమార్థంలో ప్రారంభం కానున్నాయి. దీంతో ఒకేసారి అక్కినేని బ్రదర్స్‌తో శ్రీలీల మూవీ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version