“పుష్ప 3” పై సాలిడ్ న్యూస్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు అందుకొని రికార్డులు సెట్ చేసింది. ఇండియన్ సినిమా దగ్గర ఫాస్టెస్ట్ రికార్డులతో పుష్ప 2 అదరగొట్టగా ఈ చిత్రానికి ముందే మేకర్స్ పార్ట్ 3 కూడా ఉందని కన్ఫర్మ్ చేసేసారు.

ఇక సినిమా థియేటర్స్ లో “పుష్ప 3 ది ర్యాంపేజ్” ని అధికారికంగా రివీల్ చేయగా ఇపుడు పుష్ప 3 పై మేకర్స్ పై సాలిడ్ న్యూస్ బయటకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇపుడు రివీల్ చేశారు. పార్ట్ 3 మరో రెండేళ్ల తర్వాత తాము స్టార్ట్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు లేటెస్ట్ గా తెలిపారు.

దీనితో పుష్ప గాడి ర్యాంపేజ్ మొదలు కావడానికి ఇంకో రెండేళ్లు సమయం పడుతుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో అలాగే సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో సినిమాలు ఆల్రెడీ ఓకే చేసి ఉంచిన సంగతి తెలిసిందే.

Exit mobile version