‘లైలా’ ట్రీట్‌ను ఆ రోజున తీసుకొస్తున్న విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ మూవీ ‘మెకానిక్ రాకీ’ బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాలతో బిజీగా మారాడు ఈ మాస్ హీరో. ఇప్పటికే ‘లైలా’ అనే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన విశ్వక్, ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే, ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్‌ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు.

‘లైలా’ మూవీకి సంబంధించిన ఫస్ట్ ట్రీట్‌ను నూతన సంవత్సర కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ కాగా.. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ ట్రీట్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ చిత్ర టీజర్‌ను ఆ రోజున రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version