“బఘీర” హీరోతో పీపుల్ మీడియా భారీ చిత్రం..

రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో రోరింగ్ స్టార్ శ్రీ మురళి హీరోగా నటించిన భారీ చిత్రం “బఘీర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకోలేదు కానీ ఇపుడు ఈ తర్వాత మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారితో భారీ సినిమా చేస్తున్నట్టుగా ఇపుడు అనౌన్స్ చేశారు. మరి పీపుల్ మీడియా సంస్థలో ఇది 47వ సినిమాగా అనౌన్స్ చేయగా శ్రీమురళిపై క్రేజీ పోస్టర్ తో రివీల్ చేశారు.

దీనితో ఇది కూడా ఒక మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రానికి టైటిల్ ఏంటి, దర్శకుడు ఎవరు ఇతర వివరాలు మేకర్స్ త్వరలోనే రివీల్ చేయనున్నారట. మరి నేడు శ్రీమురళి బర్త్ డే కానుకగా అనౌన్స్ చేశారు. దీనితో తన ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. మరి కన్నడ సినిమాలో ఆల్రెడీ ఓ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు. అదే నెక్స్ట్ సినిమాగా శ్రీమురళితో సినిమా చేస్తున్నారు.

Exit mobile version