చైనాలో “మహారాజ” సెన్సేషన్.. లేటెస్ట్ వసూళ్లు ఎంతంటే

తమిళ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నిథిలన్ సామినాథన్ తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం “మాహారాజ” కోసం తెలిసిందే. మరి తెలుగు సహా తమిళ్ లో మంచి హిట్ గా నిలిచి విజయ్ సేతుపతి కెరీర్ లో సాలిడ్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. మరి ఈ సినిమాని మేకర్స్ రీసెంట్ గానే చైనా దేశంలో గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొచ్చారు. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది ఇపుడు తెలుస్తుంది.

ఈ సినిమా చైనాలో 20 రోజుల రన్ ని పూర్తి చేసుకోగా అక్కడ సాలిడ్ వసూళ్లు అందుకున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి అక్కడ పి ఆర్ లెక్కల ప్రకారం మహారాజ చిత్రం 10 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసిందట. అంటే 80 కోట్లకి పైగానే గ్రాస్ ని అక్కడ అందుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది 100 కోట్లకి కూడా టచ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇలా మొత్తానికి అయితే చైనాలో కూడా ఈ సినిమా బాగానే రన్ అవుతుంది అని చెప్పాలి.

Exit mobile version