“ది రాజా సాబ్” నుంచి ఆమె పిక్ లీక్.. క్లారిటీ ఇచ్చిన నిధి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేసున్న హారర్ కామెడి థ్రిల్లర్ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ అలాగే నిధి అగర్వాల్ లు మొట్ట మొదటిసారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే లేటెస్ట్ గా నిధి అగర్వాల్ పై షూటింగ్ స్పాట్ నుంచి అంటూ గ్లామరస్ పిక్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి చక్కర్లు కొట్టింది. దీనితో ఇది ఆ సినిమాలోదే అని ఫిక్స్ అయ్యిపోయారు కానీ దీనిపై నిధి క్లారిటి ఇచ్చింది. ఆ వైరల్ అవుతున్న పిక్ రాజా సాబ్ సినిమాలోది కాదని క్లారిటీ ఇచ్చింది.

తాను చేస్తున్న ఓ యాడ్ షూట్ కి సంబంధించిన ఫోటో అని రాజా సాబ్ సెట్స్ నుంచి కాదని అందరికీ క్లారిటీ ఇచ్చింది. సో తన నుంచే క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక అందులో చెప్పడానికి ఏమి లేదు. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా టిజి విశ్వ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version