గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇక అభిమానులు సైతం ఈ మూవీతో చరణ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాలని కోరుతున్నారు.
ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్’ను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు తమ అభిమాన హీరో రామ్ చరణ్‌కు సంబంధించి ఇండియాలోనే బిగ్గెస్ట్ కటౌట్‌ను లాంచ్ చేసేందుకు వారు సిద్ధమయ్యారు. విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్‌లో డిసెంబర్ 29న ఈ బిగ్గెస్ట్ కటౌట్‌ను లాంచ్ చేసేందుకు గ్లోబల్ స్టార్ అభిమానులు రెడీ అవుతున్నారు.
దీంతో ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌ను అభిమానులు సైతం దగ్గరుండి చేస్తున్నారని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేయగా అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.