ఈటీవీ స్పెషల్ ఈవెంట్ లో “సంక్రాంతికి వస్తున్నాం” సందడి..

ఈ సంక్రాంతి కానుకగా మన టాలీవుడ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో వెంకీ మామ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి కాంబినేషన్లో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి. మరి మంచి బజ్ సంతరించుకున్న ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు.

అయితే అనీల్ రావిపూడి మార్క్ లో శరవేగంగా పూర్తయ్యిన ఈ చిత్రం ఇపుడు అంతే వేగంగా ప్రమోషన్స్ కూడా జఫుపుకుంటుంది. అలా తెలుగు ప్రముఖ ఛానెల్ ఈటీవీ లో సుడిగాలి సుధీర్, రష్మీ హోస్ట్ చేస్తున్న ఓ సోషల్ ఈవెంట్ ‘ఈ సంక్రాంతికి వస్తున్నాం’ కి “సంక్రాంతికి వస్తున్నాం” చిత్ర యూనిట్ అంతా హాజరుకావడం విశేషం. దర్శకుడు అనీల్ రావిపూడి సహా ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ ఈవెంట్ కి వచ్చారు. మరి ఈ ఈవెంట్ లో వీరి సందడి ఎంటర్టైన్మెంట్ లు ఏ లెవెల్లో ఉంటాయి అనేది వేచి చూడాల్సిందే.

Exit mobile version