యువ నటీనటులు ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేందర్ హీరోహీరోయిన్లుగా శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రమే “మర్రిచెట్టు కింద మనోళ్ళు” మూవీ సారథి స్టూడియోలో పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది. సీనియర్ నటుడు బాబు మోహన్ నటీనటులపై క్లాప్ కొట్టారు. ఆర్టిస్టు నాగ మహేష్. కెమెరా స్విఛాన్ చేశారు. థర్టీ ఇయర్స్ పృథ్వీ, రాజీవ్ కనకాల, తెలుగు ఫిలించాంబర్ అధ్యక్షలు దామోదర ప్రసాద్, నిర్మాత సీ కళ్యాణ్, టీ ఎం ఏ ఏ ప్రెసిడెంట్ రష్మీ ఠాగుర్ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా నటుడు బాబుమోహన్ మాట్లాడుతూ.. “బ్యానర్, టైటిల్, డైరెక్టర్.. ఇలా ఈ సినిమాకు అన్నీ పవర్ ఫుల్‌గానే ఉన్నాయి. బ్యానర్ నారసింహుడి పవర్ఫుల్ రూపాన్ని చూపించడం సినిమాపై పాజిటివ్ పెంచుతుంది. “మర్రిచెట్టు కింద మనోళ్ళు” చాలా మంచి టైటిల్. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్మకం ఉంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్.” అని అన్నారు.
అలాగే దర్శకుడు నరేష్ వర్మ ముద్దం మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరిని అలరించే విధంగా ఒక మంచి సబ్జెక్టుతో చేస్తున్న చిత్రమిది. “మర్రిచెట్టు కింద మనోళ్ళు” టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రారంభానికి ముందే ఈ సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమాను సపోర్టు చేసి, ఆదరించాలని అందరిని కోరుకుంటున్నాను.” అని తెలిపారు.
30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ… “ఈ సినిమా ప్రారంభోత్సవానికి నా తోటి సీనియర్ నటుడు బాబు మోహన్ వంటి వారితో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. చిత్రయూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్.” అని అన్నారు.
ఇక హీరోలు ప్రమోద్ దేవా, రణధీర్ మాట్లాడుతూ.. “ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో అవకాశం రావడం ఆనందంగా ఉంది. దర్శకుడు నరేష్ వర్మకు కృతజ్ఞతలు. తల్లిదండ్రులు చూపిన బాటలో నడుస్తూ వారి ఆశలు నిజం చేస్తాం.” అని తెలిపారు.
హీరోయిన్లు కీర్తన స్వర్గం ముస్ఖాన్ రాజేందర్ మాట్లాడుతూ.. “కెరీర్‌కు మంచి హెల్ఫ్ అయ్యే సినిమా అని ఖచ్చితంగా చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు కృతజ్ఞతలు.” అని అన్నారు.