సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జైలర్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు కొనసాగింపుగా ‘జైలర్ 2’ రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను మార్చిలో మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ ‘జైలర్ 2’లో రజనీని తొలి భాగం కన్నా మరింత స్టైలిష్‌గా చూపించనున్నారని, అలాగే రజని లుక్ విషయంలో కూడా నెల్సన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడని తెలుస్తోంది.
అన్నట్టు ‘జైలర్ 2’ చిత్రీకరణ గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ ‘జైలర్ 2’లో కూడా తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2 ను కూడా గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. టైగర్ కా హుకూమ్ అంటూ ‘జైలర్’లో హంగామా చేసిన రజనీకాంత్, జైలర్ 2లో ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి.