నార్త్ లో “పుష్ప 2” సెన్సేషన్.. నేటితో 700 కోట్ల క్లబ్ లోకి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. బయట అల్లు అర్జున్ విషయంలో పలు కాంట్రవర్సీలు ఉన్నప్పటికీ థియేటర్స్ లో మాత్రం పుష్ప రాజ్ ఆగేదెలే అంటున్నాడు. మరి ఇలా ఒక్క హిందీ వెర్షన్ అది కూడా ఒక్క ఇండియా లోనే కనీ వినీ ఎరుగని భారీ రికార్డులు తాను సెట్ చేస్తున్నాడని చెప్పాలి.

ఆల్రెడీ హిందీలో ఆల్ టైం రికార్డ్స్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇపుడు మరో రికార్డు మార్క్ ఏకంగా 700 కోట్ల క్లబ్ లోకి నేడు డిసెంబర్ 23 సోమవారం నిలవబోతుంది అని చెప్పాలి. మరి నిన్న ఆదివారం 27 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం మొత్తం 692.5 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా అక్కడి పి ఆర్ లెక్కల ప్రకారం తెలుస్తుంది.

ఇక నేడు సోమవారంతో డెఫినెట్ గా ఈ చిత్రం 700 కోట్ల క్లబ్ లోకి అఫీషియల్ గా జాయిన్ అవుతుంది అని చెప్పొచ్చు. మరి ఇలా హిందీ సినిమా హిస్టరీలో మొట్ట మొదటిసారిగా 700 కోట్ల క్లబ్ ఓపెన్ చేసిన సినిమాగా ఇపుడు పుష్ప 2 చరిత్ర సృష్టించింది అని చెప్పొచ్చు.

Exit mobile version