‘దేవర-2’ స్క్రిప్ట్ పనులు మొదలు ?

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దండయాత్ర చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ అటు ఓటీటీలో కూడా అద్భుతంగా అదరగొట్టింది. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నాయి.

ఇప్పుడున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అన్నట్టు తాజాగా ‘వార్-2’ షూటింగ్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో చేసే సినిమాపై దృష్టి పెట్టారు.

Exit mobile version