ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు చూసిన ఎదురు చూపులకి వసూళ్లతోనే ఈ సినిమా సమాధానం చెప్పింది అనొచ్చు. అయితే పుష్ప 2 కి మేజర్ గా హిందీ వసూళ్లు చాలా ప్లస్ అయ్యాయి అని తెలిసిందే.
అలా ఒక్క హిందీలోనే ఈ సినిమా ఇపుడు ఆల్ టైం రికార్డు సెట్ చేసి అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా ఇపుడు ఏకంగా 700 కోట్ల నెట్ వసూళ్లు దాటి హిస్టరీ సెట్ చేసింది. మరి నిన్న సోమవారం వసూళ్లతో కలిపి పుష్ప 2 ఏకంగా 704 కోట్ల మార్క్ కి చేరుకుంది. ఇక దీనితో మరో సాలిడ్ అప్డేట్ కూడా మేకర్స్ ఇచ్చేసారు. దీనితో హిందీలో 3డి వెర్షన్ లో ఈ చిత్రాన్ని నేటి నుంచి హిందీలో అందుబాటులోకి తెస్తున్నట్తుగా తెలిపారు మరి ఇక్కడ నుంచి ఎంతవరకు కొత్త వెర్షన్ ప్లస్ అవుతుందో చూడాలి.