విశ్వక్ “లైలా” నుంచి మోడల్ ఫస్ట్ లుక్ కి టైం ఫిక్స్..

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “మెకానిక్ రాకీ” కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత తన నుంచి రాబోతున్న మరో చిత్రమే “లైలా”. మరి ఈ సినిమాలో తాను డ్యూయల్ రోల్ చేస్తుండగా అందులో ఒక అమ్మాయిలా కూడా కనిపించే ఛాలెంజింగ్ గా చేస్తున్నాడు. అయితే లైలా సినిమా నుంచి మేకర్స్ ఇపుడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రివీల్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

ఈ క్రిస్మస్ కానుకగా రేపు డిసెంబర్ 25న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి తమ సోనూ మోడల్ వస్తున్నాడు అంటూ విశ్వక్ పై ఓ క్రేజీ ప్రీ లుక్ పోస్టర్ ని రివీల్ చేశారు. మరి రేపు రానున్న ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కిస్తుండగా సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version