బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చాలా సింపుల్ గా ఉంటాడు. సింపుల్‌గా ఉన్నా ధీమాగా ఉండగలగటమే స్టార్‌డమ్’ అంటూ అమీర్ గురించి బాలీవుడ్ లో చెప్పుకుంటూ ఉంటారు. అయితే, అసలు తాను గతంలో ఎలా ఉండేవాడో తాజాగా అమీర్ ఖానే చెప్పుకొచ్చాడు. తన వ్యక్తిగత జీవితం గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘గతంలో పర్సనల్ లైఫ్‌లో క్రమశిక్షణ లేకపోయినా సినిమా షూటింగ్స్‌కు మాత్రం సమయానికి వెళ్లేవాడిని. పైగా అప్పట్లో పైప్ స్మోకింగ్, మద్యపానం చేసేవాడిని’ అని అమీర్ చెప్పారు.
అమీర్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘తప్పు చేస్తున్నాని ఒకానొక సమయంలో గ్రహించినా ఫుల్‌స్టాప్ పెట్టలేకపోయాను, సినిమానే నాలో మార్పు తీసుకొచ్చింది. సినిమా మెడిసిన్‌లాంటిదని నేను నమ్ముతాను’ అని అమీర్ ఖాన్ తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. 2022లో ‘లాల్ సింగ్ చద్దా’తో ప్రేక్షకులను పలకరించాడు అమీర్. ప్రస్తుతం ‘సితారే జమీన్ పర్’తో బిజీగా ఉన్నాడు. మరోవైపు, డ్రీమ్ ప్రాజెక్టుగా మహాభారతం తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.