డైరెక్టర్ క్రిష్, అనుష్క ప్రధాన పాత్రలో ‘ఘాటీ’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఐతే, ఈ సినిమా కోసం క్రిష్ సరికొత్త నేపథ్యాన్ని తీసుకున్నారని.. అనుష్క పాత్రతో పాటు సినిమాలో మరో స్పెషల్ రోల్ కూడా ఉంటుందని.. ఈ నెగిటివ్ పాత్రలో మరో సీనియర్ హీరో కనిపించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ‘రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియో’లో అనుష్క చీర కట్టుకొని తలపై ముసుగు వేసికొని నడుస్తూ వెళ్తున్నట్టు చూపించారు. కాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. ఇక ఈ చిత్రం థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఘాటీ అమెజాన్ లోకి రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మేకర్స్ రూపొందించారు. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.