ఇంట్రెస్టింగ్ గా “లైలా” నుంచి విశ్వక్ ఫస్ట్ లుక్..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మెకానిక్ రాకీ” తర్వాత మళ్ళీ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధం చేస్తున్న లేటెస్ట్ చిత్రమే “లైలా”. దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ రెండు సాలిడ్ రోల్స్ చేస్తున్నాడు. మరి ఒక లేడీ గెట్ లోనే కాకుండా పక్కా మాస్ కుర్రాడిలా కూడా కనిపించనున్నాడు. మరి లేటెస్ట్ గా తన మేల్ వెర్షన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

సోనూ మోడల్ అంటూ టీజ్ చేస్తూ వచ్చిన ఈ పోస్టర్ లో కంప్లీట్ గా కొత్త విశ్వక్ కనిపిస్తున్నాడు అని చెప్పాలి. పక్కా సోషల్ మీడియాలో మోడల్ లానే గెటప్ తన చేతిపై పచ్చ బొట్లుతో కనిపిస్తున్నాడు. ఇలా తన లుక్ మాత్రం మంచి డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాణం వహిస్తుండగా రానున్న ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version