రొమాంటిక్ కామెడీగా రానున్న సుహాస్ ‘ఓ భామ అయ్యో రామా’

నటుడు సుహాస్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓ భామ అయ్యో రామా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను రామ్ గోదాల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఓ వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

‘దేవుడినైనా రాముడినైనా నడిపించేది ఆడదే’ అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్‌తో ఈ వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సుహాస్ ఈసారి కొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో అతడి పాత్ర ఎలా ఉండబోతుందా.. అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో సుహాస్‌తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అనే ఆసక్తి సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తోంది.

ఇక ఈ సినిమాలో ‘నువ్వు నేను’ ఫేం అనితా హస్సానందని ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రభాస్ శ్రీను, అలీ, రవీందర్ విజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు రధాన్ సంగీతం అందిస్తుండగా వి ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్లా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version