పిక్ టాక్: స్టైలిష్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘విశ్వంభర’ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు చిరు సిద్ధమవుతున్నాడు. కాగా, యంగ్ డైరెక్టర్స్ చెప్పే కథలకు ఇంప్రెస్ అవుతున్న చిరు, చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఓకే చేస్తున్నాడు. ఈ జాబితాలోనే ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఓ సినిమాను ప్రకటించాడు. ఇక ప్రస్తుతం చిరు తన లుక్స్‌ను మేకోవర్ చేస్తూ అందరినీ స్టన్ చేస్తున్నాడు.

తాజాగా చిరంజీవి స్టైలిష్ లుక్స్‌తో కనిపించి యంగ్ హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఈ వయస్సులో కూడా తన లుక్స్ విషయంలో చిరు తీసుకునే జాగ్రత్తలు అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇక ఈ యంగ్ లుక్స్‌తో చిరు చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Exit mobile version