రజినీకాంత్ ‘జైలర్-2’లో కేజీయఫ్ హీరోయిన్ ఫిక్స్..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా సీక్వెల్‌ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలో రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో కేజీయఫ్ చిత్ర హీరోయిన్, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటించేందుకు సెలెక్ట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బ్యూటీ ఇప్పటికే తెలుగులోనూ నాని ‘హిట్-3’ మూవీతో ఎంట్రీ ఇస్తోంది.

ఇక ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ దక్కడం అనేది విశేషమని చెప్పాలి. మరి నిజంగానే ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి ఛాన్స్ కొట్టేసిందా లేదా.. అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version