‘ఓజి’పై పవన్ కామెంట్స్ వైరల్.. ఏమన్నారంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నారో మనకు తెలిసిందే. అయితే, ఆయన అభిమానులు మాత్రం ఆయన నుంచి నెక్స్ట్ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పవన్ తన నెక్స్ట్ చిత్రాలు ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా తన చిత్రాలు ఆలస్యం కావడానికి గల కారణాన్ని పవన్ తెలిపారు. తాను రాజకీయాల్లో బిజీ కాకముందే తన చిత్రాల కోసం డేట్స్ కేటాయించానని.. అయితే, ఆయా చిత్ర యూనిట్ వాటిని ఉపయోగించుకోలేక పోయారని పవన్ తెలిపారు. అంతేగాక, ప్రస్తుతం కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని.. హరిహర వీరమల్లు 8 రోజుల షూటింగ్.. ఓజి కూడా త్వరగానే పూర్తవుతుందని పవన్ తెలిపారు.

ఇక తన అభిమానులు ఎక్కడికి వెళ్లినా ‘ఓజి.. ఓజి’’ అని కేకలు వేస్తున్నారని.. అయితే అవి అరుపులుగా కాదు బెదిరింపులుగా వినిపిస్తున్నాయని పవన్ అన్నారు. దీంతో పవన్ తన నెక్స్ట్ చిత్రాలకు సంబంధించి సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ నుంచి రాబోయే నెక్స్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ అనేది కన్ఫర్మ్ అయ్యింది.

Exit mobile version