“దూకుడు” లాంటి భారి విజయం తరువాత మహేష్ బాబు చేస్తున్న చిత్రం “బిజినెస్ మాన్”. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 11 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. నిన్న (డిసెంబర్ 22 ) ఈ చిత్రం సంగీతాన్నిశిల్ప కళా వేదిక లో ఘనంగా విడుదల చేసారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు దూకుడు లాంటి విజయాన్ని మళ్ళి అందుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్ర సంగీతం ఎలా వుందో చూద్దాం.
1 .పాట : ఆమ్చిముంబై
గాయకులు : రంజిత్ , రాహుల్ నంబియార్ , నవీన్ , ఆలప్ రాజు
రచయిత : భాస్కర్ బట్ల రవి కుమార్
ఈ పాట హీరో పరిచయ పాటగా ఉంటుంది. బృంద గానం తో పాట చాలా బాగుంది.
2 .పాట : సార ఒస్తారా
గాయకులు : సుచిత్ర, తమన్ .ఎస్
రచయిత : భాస్కర్ బట్ల రవి కుమార్
ఈ పాట మళ్ళి మళ్ళి వినాలనిపించేలా ఉంది. ఈ ఆల్బం లో బాగుండే పాటలలో ఇది కూడా ఒకటి.
3 .పాట : పిల్లా చావ్
గాయకులు : రాహుల్ నంబియార్
రచయిత : భాస్కర్ బట్ల రవి కుమార్
ఈ సోలో పాట చిత్రం లో ఉన్న మరొక మంచి పాట. పిల్లా చావ్ అంటే హీరోయిన్ ప్రేమని కాదన్నపుడు
4.పాట : చందమామ నువ్వే
గాయకులు : హరిచరణ్
రచయిత : భాస్కర్ బట్ల రవి కుమార్
ఇది మరో సోలో పాట హరిచరణ్ పాడారు. ఈ పాట హీరోయిన్ కి దూరమయిన హీరో భావాలకి సంబంధించింది.
5 .పాట : బాడ్ బోయ్స్
గాయకులు: ప్రియా హిమేష్ , గీతా మాధురి
రచయిత : భాస్కర్ బట్ల రవి కుమార్
చిత్రం లో ఇది ఐటెం సాంగ్. పూరి జగన్నాథ్ ఐటెం సాంగ్ అంటే ఎలా ఇస్తారో అందరికి తెలిసిందే .
6.పాట : బిజినెస్ మాన్ (థీం)
గాయకులు : మహేష్ బాబు , పూరి జగన్నాథ్
రచయిత : భాస్కర్ బట్ల రవి కుమార్
ఈ థీం సాంగ్ ని మహేష్ బాబు మరియు పూరి జగన్ లు పారు. నిజానికి పూరి జగ్ఫాన్ పాట పాడగా మధ్య మధ్యలో
తీర్పు :
ఈ చిత్రం లో మంచి పాటలు వున్నాయి కాని అందరికి చేరువయ్యేలా కొన్ని జాగ్రతలు తీసుకొని వుంటే బాగుండేది. “పిల్లా చావ్” మరియు “సార్ వస్తార” అనే పాటలు ఆల్బం లో మొదటి స్థానం లో ఉన్నాయి. ఆమ్చి ముంబై మరియు బాడ్ బాయ్స్ మంచి ఎనర్జీ ఉన్న పాటలు జనం లో కి తొందరగా చేరువయ్యేలా ఉంది. ఆల్బం లో చెప్పుకోడానికి తమన్ చెప్పుకోడానికి కొత్తగా ఎం చేయకపోయినా చిత్రానికి సరిపోయేలా సంగీతాన్ని అందించాడు.
– రv