రివ్యూ : ఓం – రొటీన్ యాక్షన్ డ్రామా

విడుదల తేదీ : 19 జూలై 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకుడు : సునీల్ రెడ్డి. సి
నిర్మాత : కళ్యాణ్ రామ్
సంగీతం : అచ్చు, సాయి కార్తీక్
నటీనటులు : కళ్యాణ్ రామ్, కృతి ఖర్బంద, నికీష పటేల్


నందమూరి కళ్యాణ్ రామ్ చాలా గ్యాప్ తరువాత బాక్స్ ఆఫీసు వద్ద ‘ఓం’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో నిర్మించడం జరిగింది. నికిష పటేల్, కృతి ఖర్బంద హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి సునీల్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

అర్జున్ (కళ్యాణ్ రామ్) తన తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ (కార్తీక్) అంటే ప్రాణం. తండ్రి కొడుకులు చాలా మంచి ప్రేమను రాగాలతో వుంటారు. అలాగే వారి ఫ్యామిలీ మొత్తం ఒకరిపై ఒకరికి చాలా ఆప్యాయతలు, అనురాగాలు ఉంటాయి. వీరికి బైర్రెడ్డి (రావు రమేష్) అనే రాజకీయ నాయకునికి మద్య శత్రుత్వం ఉంటుంది. ఎలాగైనా హరిచంద్ర ప్రసాద్ ను చంపడానికి బైర్రెడ్డి ప్రయత్నిస్తూ వున్నాడు. అతని ప్రయత్నాన్ని అర్జున్ అడ్డుకుంటూ ఉంటాడు. ఇంతలో అర్జున్ కి అంజలి(కృతి ఖర్బంధ) పరిచయం అవుతుంది. ఆమె అందానికి, దయా గుణానికి చూసి అర్జున్ ప్రేమలో పడతాడు. మనం అనుకున్నట్టుగానే వారిద్దరు ప్రేమించుకుంటారు. ఇంతలో కథలో ఒక ట్విస్ట్. రియా(నికిష పటేల్) ఎంట్రీ ఇస్తుంది. రియా హరిచంద్ర ప్రసాద్ ఫ్రెండ్(ఆహుతి ప్రసాద్)కూతురు. అర్జున్ ఉండగా బైర్రెడ్డి హరిచంద్ర ప్రసాద్ ను ఏమి చేయలేమని తెలిసి సంపత్ రాజ్ సహాయం కోరతాడు. అతను కూడా హరిచంద్ర ప్రసాద్ ను చంపుతానని ప్రమాణం చేస్తాడు. వీరిమద్య పాత విబేదాలు ఉంటాయి. ఇంతలో అర్జున్ కి తన జీవితంలో జరిగిన కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. అసలు ఆ నిజాలు ఏమిటి ? తరువాత ఎం జరిగింది? అతను తన తండ్రి జీవితాన్ని కాపాడడా? లేదా ? ఇవన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

కళ్యాణ్ రామ్ కొన్ని యాక్షన్ సన్నివేశాలలో చూడటానికి చాలా బాగున్నాడు. కృతి ఖర్బంధ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది. నికీష పటేల్ ఈ సినిమాలో చాలా గ్లామరస్ గా కనిపించింది.
విలక్షణ నటుడు కార్తీక్ క్లాస్ గా చాలా బాగా నటించాడు. తను తెలుగు సినిమాలలో పాత్రలకు చాలా బాగా సరిపోతాడు. సురేష్ బాగా నటించాడు. కొన్ని 3డి ఎఫెక్ట్స్ బాగున్నాయి. రావు రమేష్ శ్రీకాకుళం యాసలో మాట్లాడి అందరిని మెప్పించాడు. సినిమాలో ఇంటర్వల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్వీస్ట్ బాగున్నాయి.ఈ సినిమాని సాగదీయకుండా తీయడం ప్లస్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మంచి కథ గాని స్టోరీగని ఏమి లేదు. ఈ సినిమాలోని టెక్నికల్ ఈ సినిమా విజయానికి ఎటువంటి ఉపయోగాన్ని ఇవ్వవు. ‘ఓం’ సినిమాని 3డి లో తీయవలసిన ఆవాసం ఏమిలేదు. ఈ సినిమాలో ని కొన్ని 3డిలో షూట్ చేసినవి ప్రజలని మెప్పించేంతగా లేవు. విసువల్ ఎఫెక్ట్స్ అంతగా బాగోలేలేవు. ఈ సినిమాలో ఒక వంతెనపై జరిగే పేలుడు దృశ్యం కాస్త ఎక్కువ అనిపిస్తుంది. ఆ దృశ్యంలో విసువల్ ఎఫెక్ట్స్ చాలా పూర్ గా వున్నాయి. ఈ సినిమాలో చాలా ఎక్కువ ఫైట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో లాజికల్ గా ఒక ఫ్లో లేదు. అలాగే ఈ సినిమాలో కొన్ని అనుకోని గ్యాప్ వస్తూ వుంటాయి. కథలో వచ్చే ఎమోషన్ సన్నివేశాలకు కనేక్స్ అయ్యేలా లేవు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దగా ఏమిలేదు.

సాంకేతిక విభాగం:

అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ మాములుగా ఉంది. ఎడిటింగ్ కూడా అంతగా బాగోలేదు. ఇది సినిమాకి ఒక మైనస్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సాదారణంగా ఉంది. ఇది సినిమా విజయానికి పెద్దగా హెల్ప్ అవ్వదు. సునీల్ రెడ్డి దర్శకత్వం పరవాలేదు. తను స్క్రీన్ ప్లే పైన, ప్రొడక్షన్ వాల్యూస్ పైన కాస్త శ్రద్ద తీసుకోని ఉంటే బాగుండేది.

తీర్పు :

ఓం సినిమా రొటీన్ లైన్ తో భారీ యాక్షన్ తో తెరకెక్కిన యాక్షన్ డ్రామా. 3డి ఎఫెక్ట్స్ ఈ సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. కొంతమంది నటీనటుల పెర్ఫార్మన్స్, ఒకటి రెండు మెప్పించే సన్నివేశాలు తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు.

123తెలుగు రేటింగ్ – 2.75/5
రివ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version