ప్రత్యేక ఇంటర్వ్యూ: పూలరంగడుతో సునీల్ కి యాక్షన్ ఇమేజ్ వస్తుంది: వీరభద్రమ్

 

సునీల్ హీరోగా నటిస్తున్న ‘పూలరంగడు’ చిత్రానికి వీరభద్రమ్ దర్శకుడు. ‘అహ నా పెళ్ళంట’ చిత్రం విజయం తరువాత అతను చేయబోయే రెండవ చిత్రం ఇదే.
ఈ సందర్భంగా ఈ దర్శకుడితో మేము ప్రత్యేకంగా ముచ్చటించడం జరిగింది. ఆ ముచ్చట్లు మీకోసం అందిస్తున్నాం.

ప్రశ్న : పూల రంగడు చిత్రం విడుదల కు సిద్ధమవుతుంది. ఈ చిత్రం మీద మీ అంచనాలేంటి?
జవాబు: ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. సునీల్ మరియు ఇషా చావ్లా బాగా నటించారు . ఈ చిత్రం తో సునీల్ కి మంచి యాక్షన్ హీరో గా గుర్తింపు వస్తుంది. ఇక మీదట సునీల్ ని కామెడీ హీరో అని ఎవరు అనరు. ఈ చిత్రాన్ని 85 రోజులలో పూర్తి చేసాము.

ప్రశ్న : అయితే పూలరంగడు యాక్షన్ చిత్రం అంటారా?
జవాబు : ఈ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ చిత్రం లో కామెడీ,యాక్షన్,సెంటిమెంట్ వంటి పలు అంశాలు ఉన్నాయి ఈ చిత్రం లో మొత్తం ఐదు పాటలు ఉండగా అన్ని పాటలు అద్బుతంగా వచ్చాయి. ఈ చిత్రం లో మంచి చిత్రానికి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి.

ప్రశ్న : చిత్రం లో చెప్పుకోదగ్గ అంశాలేవి?
జవాబు : ఈ చిత్రం లో ప్రతీ అంశము చెప్పుకోదగ్గదే. సునీల్ ఆరుపలకల(సిక్స్ ప్యాక్) శరీరం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తను పతాక సన్నివేశాలలో చూపిస్తాడు . అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ చిత్రం నచ్చుతుంది. శ్రీధర్ రాసిన సంభాషణలు చాలా బాగా ఉన్నాయి. ప్రదీప్ రావత్ కూడా ఒక విబిన్నమయిన పాత్రలో కనిపిస్తారు. ఇలాంటి పాత్ర అయన వేయటం ఇదే తొలిసారి. ఈ పాత్ర కాస్త సీరియస్ గాను ఇటు హాస్యపూరితంగాను ఉంటుంది ఈ పాత్రని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు

ప్రశ్న : చిత్రం లో కామెడీ మోతాదు ఎంత ఉంటుంది?
జవాబు: చిత్రం లో మీరు చాలా కామెడీ ని ఎదురుచుడవచ్చు. ముఖ్యంగా అలీ పాత్ర అందరిని నవ్విస్తుంది. ఈ పాత్ర చిత్రం పొడవునా ఉంటుంది. సునీల్ స్నేహితుడుగా అలీ అద్బుతమయిన హాస్యాన్ని పండిస్తాడు. కోట శ్రీనివాస రావు గారు ఈ చిత్రం లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ప్రశ్న : సునీల్ తో పనిచేయటం ఎలా వుంది?
జవాబు : సునీల్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. ఈ చిత్రం చుసినవారంధరిని సునీల్ ఆశ్చర్యపరుస్తాడు . సునీల్ అందాల రాముడు మరియు మర్యాద రామన్న చిత్రాలతో మంచి నృత్య కళాకారుడిగా మాత్రమే తెలుసు కాని ఈ చిత్రం తో సునీల్ మంచి యాక్షన్ సన్నివేశాలు కూడా చెయ్యగలడు అని నిరూపణ అవుతుంది .తను ఆరు పలకల శరీరం కోసం చాలా కష్టపడ్డాడు. ఈ చిత్రంలో సునీల్ అద్బుతంగా నటించాడు.

ప్రశ్న : మరి ఇషా చావ్లా గురించి చెప్పండి ??
జవాబు : ఇషా చావ్లా మంచి ప్రతిభ కలిగిన నటి. నేను చాలా మంది కథానాయికలను స్క్రీన్ టెస్ట్ చేశా కాని ఈ పాత్రకు ఇషా చావ్లా అయితేనే న్యాయం చెయ్యగలదు అనిపించింది. ఈ చిత్రం లో కథానాయిక పాత్ర చాలా కీలకం. అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం కాదు.

ప్రశ్న : చిత్రం లో ప్రతినాయకుడి పాత్ర ఎలా ఉండబోతుంది?
జవాబు : ఈ చిత్రం లో బలమయిన ప్రతినాయిక పాత్ర ఉంది. దేవ్ గిల్ ఆ పాత్ర లో నటించారు. అయన ఈ పాత్రలో అద్బుతంగా నటించారు. ఆయన నటన అందరిని ఆకట్టుకుంటుంది.

ప్రశ్న : మీ మొదటి చిత్రం విజయవంతమయిన హాస్యపూరిత చిత్రం ఈ చిత్రం లో కూడా హాస్యం ఉంటుంది అంటున్నారు. అంటే మీరు ఇంకా ఇలాంటి చిత్రాలే చేస్తారా?
జవాబు : నాకు ఎంటర్ టైన్మెంట్ అంటే చాలా ఇష్టం ప్రేక్షకులతో కలిసి నేను కూడా చిత్రాన్ని ఆస్వాదించాలి. అది కామెడీ కావచ్చు యాక్షన్ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు నా చిత్రం లో అన్ని సమ పాళ్ళలో ఉంటాయి . ప్రేక్షకులు నా చిత్రాన్ని చుసేప్పుడు విసుగు చెందరు.

ప్రశ్న : మీ చిత్రాలలో ఎవరి శైలి ఎక్కువగా కనిపిస్తుంటుంది ?
జవాబు : ఇ.వి.వి సత్యనారాయణ గారు ఒక మాట అనేవారు ” నిర్మాత కి లాభం వచ్చెలా చిత్రం తీయాలి ఎందుకంటే నిర్మాత బాగుంటే పరిశ్రమ బాగుంటుంది”. ఈ మాటలు మనసులో పెట్టుకొని చిత్రాలు తీస్తూ ఉంటాను. అంతే కాని నేను ప్రత్యేకంగా ఎవరి శైలిని ఉపయోగించను. నా చిత్రం లో నా శైలి కనిపిస్తూ ఉంటుంది.

ప్రశ్న : ఈ చిత్ర నిర్మాణం గురించి కొన్ని విషయాలు చెప్పండి?

జవాబు : ఈ చిత్రాన్ని కే. అచ్చి రెడ్డి గారు నిర్మిస్తున్నారు. చిత్రానికి కావాల్సినవన్నీ అందించారు. అనుకున్న బడ్జెట్ లో నే చిత్రం పూర్తి చేసాము అది కూడా అనుకున్న సమయం లో నే చేసాము. ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. ఆర్ . ఆర్ . మేకర్స్ మరియు మాక్స్ నిర్మాణ సంస్థలతో పని చేయటం చాలా ఆనందకరంగా ఉంది.

ప్రశ్న : మీ అభిమాన నటులు ఎవరు?
జవాబు : స్వర్గీయ నందమూరి తారక రామా రావు గారంటే చాల ఇష్టం . ఎప్పటికయినా నాగార్జున గారితో చిత్రం చెయ్యాలనేది నా కల. మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ మరియు ఇక కొంత మంది హీరో లు అంటే ఇష్టం. కథానాయికలలో కాజల్ అంటే చాల ఇష్టం అందం అభినయం సమపాళ్ళలో ఉన్న కథానాయిక.

ప్రశ్న : అయితే మీ కలల చిత్రం నాగార్జున గారితో ఉండవచ్చా?
జవాబు : ఆయన్ని ఒకసారి కలిశాను. అయన కోసం కథ ను కూడా సిద్దం చేసుకున్నా. పూల రంగడు చిత్రం తరువాత నాగార్జున గారి చిత్రమే ఉండవచ్చు.

ప్రశ్న : సంక్రాంతి పరుగు లో పెద్ద హీరోల చిత్రాలు చాలా వున్నాయి కదా మీ పూల రంగడు చిత్రం ఆ పోటి ని తట్టుకోగలదా ?
జవాబు : మా చిత్రం కూడా భారి చిత్రమే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 450 ధియేటర్ ల లో విడుదల చేస్తున్నాం. మంచి చిత్రాన్ని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు. నా మొదటి చిత్రం ” ఆహ నా పెళ్ళంట ” కూడా భారి చిత్రాల నడుమ వచ్చి విజయం సాదించిన చిత్రమే.

ప్రశ్న: చిత్ర పరిశ్రమ లో ఎలా అడుగు పెట్టారు?
జవాబు: నేను గోదావరి జిల్లాలో చిన్న గ్రామం లో పుట్టాను ఇ.వి.వి సత్యనారాయణ గారి ఊరికి చాల దగ్గర అయన దగ్గరే అసిస్టెంట్ గ పని చేశాను. ఆయనే కాకుండా ఇంకా కొంతమంది దర్శకుల దగ్గర పని చేసాను.

ప్రశ్న : మీ రాబోయే చిత్రాల గురించి చెప్పండి?
జవాబు : కొన్ని చిత్రాలు ఒప్పుకున్నాను. పూల రంగడు చిత్రం విడుదలయిన తరువాత మీకే చెప్తాను (నవ్వుతూ).

ఇలా ఆ ఇంటర్వ్యూ ముగిసింది వీరభద్రం గారు పూల రంగడు పాట చిత్రీకరణకు వెళ్ళిపోయారు. ఈ ఇంటర్వ్యూ మిమ్మల్ని ఆనందపరిచింది అనే అనుకుంటున్నాం.

అనువాదం – రv

Interview English Version

Exit mobile version