ఆడియో సమీక్ష : భాయ్ – దేవీశ్రీ అందించిన మరో పెప్పీ ఆల్బమ్

Bhai_Posters

‘కింగ్’ అక్కినేని నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోని నిన్ననే రిలీజ్ చేసారు. వీరభద్రం చౌదరి ఈ మాస్ ఎంటర్టైనర్ ని డైరెక్ట్ చేసాడు. నాగార్జున – రిచా గంగోపాధ్యాయ్ జంటగా నటించిన ‘భాయ్’ సినిమాకి ప్రస్తుతం క్రేజ్ బాగుంది. ఇప్పటి వరకు నాగార్జున – దేవీశ్రీ కాంబినేషన్లో చాలా సక్సెస్ఫుల్ ఆడియో ఆల్బమ్స్ వచ్చాయి. మరో సారి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ ఆల్బం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

1. పాట : భాయ్

గాయకుడు : సుచిత్ సురేసన్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

‘భాయ్’ అంటూ సాగే టైటిల్ సాంగ్ సినిమాలో హీరోపై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ అని వినగానే చెప్పేయొచ్చు. ఈ సాంగ్ చాలా పెప్పీగా సాగుతుంది. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సాలిడ్ మ్యూజిక్ అందించాడు. ఇంట్రడక్షన్ సాంగ్ కి తగ్గట్టు సుచిత్ సురేసన్ చక్కని గాత్రాన్ని అందిచాడు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి సాహిత్యం అందించాడు. హీరో పాత్ర ప్రతిబింబించేలా రామజోగయ్య శాస్త్రి ఈ పాటని రాశారు. పపెర్క్యూషణ్ మరియు సన్నాయి లాంటి వాయిద్యాలతో మంచి ఎఫెక్ట్స్ వచ్చేలా దేవీశ్రీ ఈ పాటని కంపోజ్ చేసారు. ఈ పాట వినగానే నచ్చేలా ఉంటుంది, అలాగే ఈ పాట చాలా పాపులర్ అవుతుంది.

 

2. పాట : నెమ్మదిగా

గాయకుడు : వేణు శ్రీరంగం, శ్వేత మోహన్

సాహిత్యం : అనంత్ శ్రీరామ్

‘నెమ్మదిగా’ సాంగ్ వినసొంపుగా సాగే రొమాంటిక్ డ్యూయెట్. వేణు శ్రీరాం – శ్వేత మోహన్ లు ఇద్దరూ తమ వాయిస్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఎంతో ఎనర్జీగా ఈ పాటని ఆలపించారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం బాగుంది. దేవీశ్రీ అందించిన మ్యూజిక్ చాలా సింపుల్ గా ఉంది, అలాగే ఎంతో ఎఫ్ఫెక్టివ్ గా కూడా ఉంది. ఈ పాటలో కూడా పెర్క్యూషణ్ వాయిద్యాల సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తాయి. ఈ పాట రొమాంటిక్ సాంగ్ అయినప్పటికీ కాస్త వేగంగానే ఉంటుంది. ఈ రొమాంటిక్ డ్యూయెట్ అందరికీ అనచ్చే సాంగ్ అవుతుంది.

 

3. పాట : ఓ పిల్ల పిల్ల

గాయకుడు : డేవిడ్ సిమొన్, రీట

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

ఆల్బంలో పెప్పీగా సాగే మరో సాంగ్ ‘ఓ పిల్ల పిల్ల’. ఈ పాటకి డేవిడ్ సిమొన్ వాయిస్ పెద్ద ప్లస్ అని చెప్పుకోవాలి. అతను చాలా బాగా పాడాడు, అలాగే రీట కూడా తన వాయిస్ తో పాటకి న్యాయం చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం జస్ట్ యావరేజ్ గా ఉంది. దేవీశ్రీ ఈ పాటకి పెప్పీగా సాగే మ్యూజిక్ ని అందించాడు. ఈ పాత చాలా వేగంగా సాగడం మరియు మంచి బీట్స్ తో సాంగ్ ఉండడం వల్ల వినడానికి బాగుంటుంది. ఆల్బంలో ఇదొక డీసెంట్ సాంగ్ అని చెప్పొచ్చు.

 

4. పాట : అయ్యబాబోయ్ నీ చూపు

గాయనీ గాయకులు : టిప్పు, గీతామాధురి

సాహిత్యం : భాస్కర భట్ల

‘అయ్యబాబోయ్ నీ చూపు’ రెగ్యులర్ గా అనిపించే మాస్ సాంగ్. ముఖ్యంగా ముందు బెంచ్ వారిని టార్గెట్ చేస్తూ చేసిన సాంగ్ అని చెప్పుకోవాలి. టిప్పు – గీతా మాధురి కలిసి పాటని బాగా పాడారు. భాస్కర భట్ల అందించిన సాహిత్యం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇది మాస్ సాంగ్ కావడంతో పర్ఫెక్ట్ గా షూట్ చేస్తే మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.

 

 

5 పాట : మోస్ట్ వాంటెడ్
గాయకుడు : నరేంద్ర, మమతా మోహన్ దాస్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

‘మోస్ట్ వాంటెడ్’ సినిమాలో వచ్చే ఐటెం సాంగ్. ఈ పాటలో వచ్చే లేడీ వాయిస్ ని ఐటెం సాంగ్స్ బాగా పాడుతుంది అని పేరున్న మమత మోహన్ దాస్ అందించారు. ఆమె వాయిస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది. ఓవరాల్ గా పాటని చాలా బాగా పాడింది. నరేంద్ర వాయిస్ కూడా బాగుంది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం జస్ట్ ఓకే అనేలా ఉంది. మాములుగానే ఐటెం సాంగ్స్ చేయడంలో దిట్ట అయిన దేవీశ్రీ ఈ పాటలో మంచి మాస్ ఫీలింగ్ వచ్చేలా పాటకి తగ్గట్టు మ్యూజిక్ కంపోజ్ చేసాడు. పాట చాలా వేగంగా ఉంటూ, మంచి బీట్స్ తోడవడంతో పాట చాలా బాగా వచ్చింది.

తీర్పు :

యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ ఈ సారి ‘భాయ్’ సినిమాతో చాలా పెప్పీగా సాగే ఆల్బంతో మనముందుకు వచ్చాడు. పాటలన్నీ చాలా వేగంగా సాగేలా ఉన్నాయి, అలాగే కొన్ని పాటలు వినగానే నచ్చేలా ఉన్నాయి. భాయ్ టైటిల్ సాంగ్ బాగా పాపులర్ అవుతుంది. ‘భాయ్’ ఆల్బం నుంచి ఎన్నుకోదగిన పాటలు ‘భాయ్’, ‘నెమ్మదిగా’, ‘ఓ పిల్ల పిల్ల’. నాగార్జున – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఇప్పటివరకు సక్సెస్ఫుల్ మ్యూజిక్ ఆల్బమ్స్ వచ్చాయి. ఈ సినిమాతో కూడా అదే సక్సెస్ ని కంటిన్యూ చేసారు.

రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version