సమీక్ష : మసాలా – సరైన రుచి లేని మసాలా

Masala_Review విడుదల తేదీ : 14 నవంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకుడు : కె. విజయ్ భాస్కర్
నిర్మాత : దగ్గుపాటి సురేష్ బాబు
సంగీతం : థమన్
నటీనటులు : వెంకటేష్, రామ్, అంజలి, షాజహాన్ పదమ్సీ..


విక్టరీ వెంకటేష్, రామ్ హీరోలుగా నటించిన సినిమా ‘మసాలా’. ఈ సినిమాని బాలీవుడ్ ‘బోల్ బచ్చన్’ సినిమాకి రిమేక్ గా నిర్మించారు. ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాని సురేష్ బాబు, స్రవంతి రవి కిషోర్ కలిసి నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ :

బలరాం (వెంకటేష్) భీమరాజపురంలో నివేసించే ఒక మంచి మనసున్న, బలం బలగం కలిగిన వ్యక్తి. తను నిజాయితీగా, న్యాయబద్దంగా ఉంటు అందరూ బాగుండాలని అనుకునే వ్యక్తిత్వం అతనిది. కానీ అతనికి అబద్దం చెప్పడం అంటే నచ్చదు. ఎవరైనా అతనితో అబద్దం చెబితే వారికి సరైన బుద్ది చెబుతాడు.

కొన్ని కారణాలవల్ల రెహ్మాన్ (రామ్) జాబ్ ను వెతుకుంటూ తన అక్క సానియా(అంజలి)తో కలిసి ఆ ఊరికి చేరుకుంటాడు. రెహ్మాన్ చేసిన ఒక పని వల్ల అతని దైర్య సాహసాలు నచ్చి బలరాం అతన్ని తన వద్ద పనికి పెట్టుకుంటాడు. అయితే ఈ క్రమంలో రెహ్మాన్ తన పేరును రామ్ గా మార్చి చెప్పవలసి వస్తుంది. కొద్ది రోజుల్లోనే బలరాంకు నమ్మిన బంటుగా రెహ్మాన్ మారతాడు.

ఒక సమయంలో బలరాం రహ్మాన్ నమాజ్ చేస్తుండగా చూసి అతన్ని నిలదీస్తాడు. అతని అనుమానాన్ని పోగొట్టడానికి అతను తన తమ్ముడని పేరు రహ్మాన్ అని చెబుతాడు.(అతను బలరాంతో అతనొక గే అని అతని పేరు రహ్మాన్ అని చెబుతాడు). ఈ గే పాత్రని రహ్మాన్ సృష్టిస్తాడు. బలరాం అతని చెల్లెలి(షాజాహాన్ పదమ్సీ)కి డాన్స్ నేర్పడానికి అతని నియమిస్తాడు.

రహ్మాన్ రెండు పాత్రలు రామ్, రహ్మాన్ గా చేయాడానికి చాలా కష్టపడుతూ, తికమకపడుతూ ఉంటాడు. చివరికి బలరాంకి నిజం తెలిసిపోతుంది. మరి బలరాం నుండి రహ్మాన్ ఎలా తప్పించుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

బలరాంగా వెంకటేష్ మంచి ఎంటర్టైనింగ్ పాత్రలో నటించాడు. కొన్ని సన్నివేశాలలో అతను మాట్లాడిన బట్లర్ ఇంగ్లిష్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లబించింది. రామ్ చూడటానికి చాలా బాగున్నాడు. తను చేసిన రెండు పాత్రలు రామ్, రహ్మాన్ లను చాలా సునాయాసంగా చేసేశాడు. అతను చేసిన గే పాత్రలోని కామెడీ ప్రేక్షకులని బాగా నవ్వించింది. ఈ సినిమా మొదటి బాగంలో కొన్ని మంచి ఎంటర్టైనింగ్ సన్నివేశాలు వున్నాయి. వెంకటేష్, జయప్రకాశ్ రెడ్డి మధ్య జరిగే కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో రామ్ గే హా నటించిన కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

రోహిత్ శెట్టి తెలుగు సినిమాలను చూసి దానితో సినిమాలు తీస్తాడు. అలాగే ‘బోల్ బచ్చన్’ సినిమాని కూడా నిర్మించాడు. మళ్ళి దానిని తెలుగులో తీయడం నిజంగా ఒక విచిత్రమైన ఆలోచన. రోహిత్ శెట్టి నిర్మించిన సినిమాలు మంచి ఎంటర్టైనింగ్ ను కలిగి వుంటాయి కానీ ఆ సినిమాలలో స్టొరీ ఏమి ఉండదు. ఆ విషయం ‘మసాలా’ సినిమాకు మైనస్ అయ్యింది. ఈ సినిమా ప్లాట్ చాలా పాతది, గతంలో వచ్చింది. కోవై సరళ రికార్డింగ్ డాన్స్ సన్నివేశాలు చూడటానికి చాలా ఆడంబరంగా వున్నాయి. ఆమె చేసిన జోక్స్ , ట్విస్ట్ లన్ని ఊహించే విదంగా వున్నాయి. ఈ సినిమాలో ఒక పెద్ద మైనస్ సమయానికి తగినట్టుగా పాటలు రాకపోవడం. ఈ సినిమాలోని పాటలు సాదారణంగా వున్నాయి . అవి సినిమాకు ఏమాత్రం సహాయం కాలేదు. షాజాహాన్ పదమ్సీ తన నటనని ఇంకాస్తా మెరుగు పెట్టవలసి ఉంది. అన్ని సన్నివేశాలలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ ఒకే విధంగా కనిపించింది. సినిమాలో అంజలి పాత్ర చాలా స్వల్పంగా సినిమాకు ఏమాత్రం ఉపయోగపడని విధంగా ఉంది. సినిమా క్లైమాక్స్ సన్నివేశం చాలా దారుణంగా ఉంది. అవసరంలేని హంగామా అలాగే గ్రాఫిక్స్ చాలా పూర్ గా వుంది.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫి మాములుగా ఉంది. ఎడిటింగ్ అంత స్మూత్ గా లేదు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకే. కానీ పాటలు మాత్రం అంత బాగోలేవు. కొన్ని ప్రదేశాల్లో అనిల్ రావిపూడి అందించిన డైలాగ్స్ బాగున్నాయి. విజయ్ భాస్కర్ దర్శకత్వం మరి అంత బాగోలేదు. చాలా ప్రదేశాలలో ఎంటర్టైన్మెంట్ పై ఆడరపడినట్టుగా అనిపించింది.

తీర్పు :

మసాలా లో కొన్ని మంచి సన్నివేశాలు వున్నాయి. సినిమాలో వెంకటేష్, రామ్ లు సమయానికి తగినట్టుగా చేసిన కామెడీ బాగుంది. కానీ కొన్ని సన్నివేశాలలో పాత ప్లాట్, స్క్రీన్ ప్లే బాగలేకపోవడం సినిమాని మైనస్. ఏ పదార్థం అయిన మంచి రూచి రావాలంటే అది అన్నిరకాలుగా బాగున్నప్పుడే అది బాగుంటుంది. కానీ దీనిలో మసాలా లో మిస్సయ్యాయి.

123తెలుగు.కామ్ రేటింగ్ 2.75/5
రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు
అనువాదం : నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version