సమీక్షా : కమలతో నా ప్రయాణం – ముగింపు లేని ప్రయాణం

kamalatho-na-prayanam-telug విడుదల తేది : 14 మార్చి 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : ఎన్ఏ
దర్శకత్వం : నరసింహ నంది
నిర్మాతలు : ఇసనక సునీల్ రెడ్డి
సంగీతం : కేకే
నటినటులుశివాజీ, అర్చన

నేషనల్ అవార్డు విజేత డైరెక్టర్ నరసింహ నంది మరోక అచ్చమైన ఆర్ట్ హౌస్ చిత్రం ‘కమలతో నా ప్రయాణం’ని తెరకెక్కించారు. ఇది ఒక సింపుల్ లవ్ స్టొరీ. ఈ సినిమాలో శివాజీ, అర్చన హీరో హీరోయిన్ గా నటించారు. ఇది 1950లో చిత్రీకరించినట్టుగా ఉంటుంది. ఈ సినిమా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ :

కమల రాణి (అర్చన) 1950లో ఒక సాదారణ కాల్ గర్ల్, ఆమె మానసికంగా భాదపడుతూ ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడు తన జీవితం గురించి ఆలోచించిన తన జీవితంలోకి ఒక మంచి, నిజాయితీపరుడైన మగడు రావాలని అతను తన శరీరాన్ని కాకుండా ఆత్మను ప్రేమించాలని కలలు కంటూ ఉంటుంది. ఒక రోజు ఆమె సూర్యనారాయణ(శివాజీ) అనే అతన్ని కలుసుకుంటుంది. అతను భారీ వర్షం కారణంగా ఆమె ఇంట్లో ఉండిపోవలసి వస్తుంది. కమల అతను కూడా అందరిలాంటి మగాడేనని బావించి అతనితో ఒక కాల్ గర్ల్ లా ప్రవర్తిస్తూ ఉంటుంది.

సూర్యనారాయణ కమలతో తను అందరిలా తను రాలేదని తను తన చిన్ననాటి స్నేహితుడినని అందుకే నిన్ను కలవడానికి వచ్చానని అంటాడు. ఆ తరువాత వారిద్దరూ వారి వారి జీవితంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ప్రేమలో పడిపోతారు. ఆ తరువాత ఉదయం సూరి కమలతో తనని ఈ జీవితం నుండి విముక్తిరాలిని చేస్తానని ప్రమాణం చేస్తాడు. అనంతరం వారిద్దరూ వారికున్న పెండింగ్ పనులన్ని పూర్తి చేసుకొని పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత ఏం జరిగింది? వారిదారు పెళ్లి చేసుకున్నారా ? లేదా ? తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాని చిత్రీకరించిన విదానం 1950 కాలంలా ఉంటుంది. సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ సినిమాని మూడు పాత్రలతో అద్భుతంగా తెరకెక్కించారు. కమలగా అర్చన పాత్ర చాలా బాగుంది. నాశనమైపోయిందనుకున్న ఆమె జీవితం, అలాగే మొదటి బాగం తరువాత బాగావుతుంది. అలాగే మానవత విలువలు, ఎమోషన్స్ ని ఈ రోజుల్లో ఎలా మిస్ అవుతున్నారో చక్కగా చూపించారు. సినిమా సెకండాఫ్ మొదట కాస్త వేగంగా సాగుతుంది. కానీ చివరి ఇరవై నిముషాలు కాస్త నెమ్మదిగా, నమ్మలేని విదంగా సాగుతుంది. శివాజీ, అర్చన మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో శివాజీ కీలకమైన పాత్ర చేశారు. ఆయన తన పాత్రని పూర్తి స్థాయిలో రియాలిటిగా చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయన పాత్రని దృడంగా కాకుండా సాదారణంగా చేసి ఉంటే అందరికి మెప్పించే విదంగా వుండేది.
ఈ సినిమా నెమ్మదిగా సాగుతుంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అనుకోని సినిమాకు వెళ్ళవద్దు. ఇది ఒక అచ్చమైన ఆర్ట్ హౌస్ సినిమా. ఈ సినిమాని ఆడియన్స్, ఫిల్మ్ ఫెస్టివల్ లను టార్గెట్ గా చేసుకొని నిర్మించారు. ఈ సినిమాకి పాటలు ఒక పెద్ద మైనస్. మంచి వేగంతో వెళ్తున్న సినిమాకి ఇవి స్పీడ్ బ్రేకర్స్ లా అనిపిస్తాయి. ఫస్ట్ హఫ్ లో కొన్ని సన్నివేశాలు క్లారిటిగా వుండవు. మొదటి బాగం సినిమా మొత్తం నత్త నడకల సాగుతుంది. ఈ సినిమా సెకండాఫ్ లో కాస్త వేగం వుంజుకుంటుందని అనుకునేలోగా మళ్ళి వేగం తగ్గుతుంది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ పరంగా ఈ సినిమా బాగుంది. 1950 కాలంలా బాగా చూపించారు. ఈ సినిమా చూస్తే మీరు ఈ సినిమాని 2014లో తీశారని ఎవరు అనుకోరు. కెమెరా వర్క్ నిజంగా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో గ్రామీణ ప్రాంతాల సంస్కృతి, పచ్చదనం, అక్కడి సంప్రదాయాలు చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో పాటలు కాస్త నిరుత్సాహపరుస్తాయి. అలాగే సినిమా వేగాన్ని తగ్గించే విదంగా వున్నాయి. డైరెక్టర్ నరసింహ నంది ఈ సినిమాలో అవసరం లేని చోట పాటలను పెట్టకుండా ఉండవలసింది. సినిమా స్క్రీన్ ప్లే బాగుంది. కానీ కొన్ని ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించకుండ ఉంటే బాగుండేది. డైలాగ్స్ సింపుల్ గా నీట్ గా వున్నాయి. ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలను నిజమైన లోకేషన్స్ లో చిత్రీకరించి వుంటే బాగుండేది.

తీర్పు :

ఈ సినిమాకి కమర్షియల్ ఫార్మేట్ పరంగా రేటింగ్ ఇవ్వడం లేదు. ఇది అచ్చమైన ఆర్ట్ హౌస్ సినిమా. ఎప్పుడు రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసి బోరింగ్ తో వున్నవారు ‘కమలతో నా ప్రయాణం’ సినిమా కి వెళ్ళవచ్చు. ఈ సినిమ కాస్త నెమ్మదిగా సాగినప్పటికి ఇంటరెస్టింగ్ గా ఉండే ఒక అర్థం ఉన్న సినిమా.

123తెలుగు. కామ్ రేటింగ్ : ఎన్ఏ
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version