సమీక్ష: హృదయం ఎక్కడున్నది – స్లో మరియు బోరింగ్ సినిమా

Hrudayam-Ekkadunnadi విడుదల తేది : 15 మార్చి 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : వి. ఆనంద్
నిర్మాత : పవన్ మంత్రిప్రడగా, సంజయ్ ముప్పనేని
సంగీతం : విశాల చంద్రశేఖర్
నటినటులు : కృష్ణమాధవ్, అనుష, సంస్కృతి


ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన ‘హృదయం ఎక్కడున్నది’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు కృష్ణమాధవ్. ఈ సినిమాకు వి. ఆనంద్ దర్శకుడు. అనుష, సంస్కృతి హీరోయిన్స్. మహేష్ బాబు బంధువైన కృష్ణమాధవ్ తెలుగు సినిమా రంగంలో హీరోగా స్థిరపడాలనుకుంతుననాడు. ఈ సినిమా రివ్యూ ని చూద్దాం

కధ:

మాధవ్(కృష్ణమాధవ్) ఒక అర్కేటెక్ట్. తను చిన్నప్పుడు ఇష్టపడిన గాయత్రి(అనుష)ను అనుకోకుండా ఒక కాఫీ షాప్ లో కలుస్తాడు. అంతేకాక గాయత్రికి కూడా తానంటే ఇష్టమని తెలుసుకుంటాడు. కన్నిరోజులు గడిచాక వారు ప్రేమలోపడి ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు

హైదరాబాద్ లో భారీ సంఖ్యలో బిర్యాని హోటల్ లు వున్న ఒక బిజినెస్ మ్యాన్(ఆహుతి ప్రసాద్) కూతురు గాయత్రి. ఆమె తన తండ్రికి మాధవ్ ని పరిచయం చేస్తుంది. అనుకోని సంఘటనల కారణంగా ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ తనకి వస్తుంది

పోద్దికగా పనులు చేసుకునే మాధవ్ కు కూలి జనం నుండి కష్టాలు వస్తాయి తన అసహనమే దానికి కారణమని అర్ధమవుతుంది. ఈ సమయంలో నిత్య(సంస్కృతి) మాధవ్ తన జీవితంలోకి ప్రవేశించి తనతో చాలా సమయం గడుపుతుంది. సివిల్ ఇంజినీర్ అయిన నిత్య నాన్నగారు మాధవ్ కి కొన్ని మెళుకువలు నేర్పుతారు

ఇప్పుడు మాధవ్ జీవితం గాయత్రి, నిత్య ల మధ్యలో ఉండిపోయింది. మాధవ్ ఎం చేస్తాడో అన్నది మిగిలిన స్టొరీ

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో అనుష నటన ఆకట్టుకుంటుంది. గాయత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. నిత్య పాత్రలో సంస్కృతి ఒకే. కొత్త నటుడిగా కృష్ణ మాధవ్ నటన పర్వాలేదు. కానీ కెరీర్ లో నిలదొక్కుకోవాలంటే తాను ఇంకా చాలా కష్టపడాలి
సినిమాలో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మన్మధుని పాత్రలో హర్షవర్ధన్ అలరించాడు. ఆహుతి ప్రసాద్ ఒకే. ‘గాయత్రి గాయత్రి’ పాట వినడానికి, చూడడానికి కుడా బాగుంది

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాను నడిపించిన తీరు నిరాశ కలిగిస్తుంది. అక్కర్లేని సన్నివేశాలు చిత్రంలో చాలా వున్నాయి. మాధవ్ ఫ్యాక్టరీలో పనిచేసే వారికోసం ఐటెం గర్ల్ ని పెట్టడం వంటి సీన్ లు ఉదాహరణ

సినిమాలో హీరో హీరోయిన్ ల నటన, వారి మధ్య కెమిస్ట్రీ అంత ప్రభావం చూపలేదు. అసల నిత్య పాత్రను ఎందుకు పెట్టుకున్నాడో, అర్ధాంతరంగా ఎందుకు ఆపేసాడో ఆ దర్శకుడికే తెలియాలి.

వీక్షకులు ఈ సినిమా ఎలాంటి అనుభూతి మిగల్చదు. ఎంటర్టైన్మెంట్, కామెడి అన్న పదాలు మర్చిపోవచ్చు. సినిమా కుడా ఏ మాత్రం వేగవంతంగా సాగదు. సివిల్ ఇంజినీరింగ్, బిల్డింగ్ నిర్మాణం వంటి అంశాలపై తీసుకున్న క్లాస్ లా కనిపిస్తుంది

సాంకేతిక విభాగం:

పసినిమాలో నిర్మాణ విలువలు అంతంతమాత్రం. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ చాలా గందరగోళంగా వుంది. డైలాగ్స్ వినసొంపుగా లేవు. సంగీతం సో సో గా సాగింది. నేపధ్య సంగీతం గురించి మాట్లాడకపోవడం మంచిది

వి ఆనంద్ దర్శకత్వం, సినిమాను నడిపించిన తీరు ఈ సినిమాకు అత్యంత భాదాకరమైన అంశాలు

తీర్పు:

‘హృదయం ఎక్కడున్నది’ సినిమా కొత్తవారిదైనా సరే త్వరగా మర్చిపోవలిసిన సినిమా. చాలా నిమ్మదిగా బోరింగ్ గా సాగుతుంది. కృష్ణ మాధవ్ ఈ సినిమా వరకూ ఒకే అనిపించినా వీలైనంత త్వరగా ఆటను తన నటనను మెరుగుపరుచుకోవాలి. ఈ హృదయం లేని ప్రేమ కధ నుండి దూరంగా వుండడం మంచిది

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version